close

తాజా వార్తలు

Published : 26/02/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో 189 కేసులు.. 2 మరణాలు

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,432 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 189 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇద్దరు బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,98,453కి చేరింది. 24 గంటల వ్యవధిలో మరణించిన వారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,632 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది పూర్తిగా కోలుకున్నారు. దీందో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 2,94,911కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,910 యాక్టివ్‌ కేసులుండగా..  818 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 86,18,845 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని