తిరుపతి ఉపఎన్నికకు సీపీఎం అభ్యర్థి ఖరారు
close

తాజా వార్తలు

Published : 16/03/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి ఉపఎన్నికకు సీపీఎం అభ్యర్థి ఖరారు

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు సీపీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిగా నెల్లూరు యాదగిరిని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో సీపీఎంకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలు, అన్యాయాన్ని ప్రతిఘటిస్తూనే కేంద్రంలోని భాజపా చేస్తోన్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తామన్నారు. సీపీఎం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజా వాణిని వినిపిస్తూ అన్యాయంపై పోరాటం కొనసాగిస్తోందన్నారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన నేపథ్యంలో డాక్టర్‌ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని