close

తాజా వార్తలు

Updated : 21/04/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి . ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంకటహర గణపతి స్తోత్రము పఠించడం మంచిది.

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక  వ్యవహారాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. గణపతి స్తోత్రం పఠించడం మంచిది

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొదలుపెట్టే పనుల్లో  ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.

అనుకున్న ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అరుగుదల సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి.  సమయానికి  నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే  బాగుంటుంది.

తలపెట్టిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. అనవసర విషయాలను పొడిగించకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శివారాధన చేయడం మంచిది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని