Covid కేంద్రంలో ప్రమాదం..18 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid కేంద్రంలో ప్రమాదం..18 మంది మృతి

భరూచ్‌ : గుజరాత్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న భరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని కింది అంతస్తులో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఐదు అంతస్తుల ఈ ఆస్పత్రి భవంతిలో ప్రమాద సమయంలో ఉన్న మరో 50 మంది పేషంట్లను అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రక్షించారు. బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు 190 కి.మీ దూరంలో భరూచ్‌-జామ్‌బూసర్‌ జాతీయ రహదారిపై ఈ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని