close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 5 PM

1. తితిదే ఆస్తులు అమ్మబోయేది లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది: జగన్‌

అవినీతి రహిత పాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పారిశ్రామికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపు తప్పక వస్తుంది..కానీ, హోదా అడగడం మానుకోకూడదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకాలు వచ్చేవన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కామినేని కూడలి వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. కామినేని ఫ్లైఓవర్‌ 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో రూ. 43 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనిద్వారా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మిడతలపై ముప్పేట దాడికి..

గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు, మరోవైపు ఈ మిడతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టాడనికి అత్యాధునిక స్ర్పేయర్లు, డ్రోన్‌లను సిద్ధం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 91 లక్షల మందిని తరలించాం: కేంద్రం  

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టులో విచారణ నిర్వహించింది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తీసుకున్న చర్యలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు. మే 1 నుంచి  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లలో తరలించినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 8కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి..!

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో పేదరికంలోకి జారిపోయే చిన్నారుల సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 8కోట్ల 60లక్షలకు చేరుకుంటుందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఇది ఒకేసారి 15శాతం పెరుగుతుందని తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావంతో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టకపోతే.. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 67.2కోట్ల మంది జాతీయ పేదరిక స్థాయికన్నా దిగువకు పడిపోతారని యునిసెఫ్‌ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వారికి తప్ప అందరికి కనిపిస్తుంది: సోనియా

వలసకార్మికులు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా మాట్లాడుతూ..‘వారి బాధను అందరూ చూశారు. వారు ఏడుపులు విన్నారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఇంకా చూసినట్లు లేదు. రానున్న ఆరు నెలల కాలానికి ప్రతి పేద కుటుంబానికి కేంద్రం రూ.7,500 అందించి ఆదుకోవాలి. అలాగే ఇళ్లకు చేరుకోడానికి సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలి’ అని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘సైక్లింగ్‌ గర్ల్‌’ జ్యోతికి సూపర్‌-30 ఆఫర్‌

లాక్‌డౌన్‌ వేళ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని 1200 కి.మీల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి తీసుకెళ్లిన బాలిక జ్యోతి కుమారికి ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది.  ఆమె దయనీయగాథకు పట్నాలోని ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థ సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ చలించిపోయారు. అంతేకాకుండా ఆమెకు ఓ గొప్ప అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక భవిష్యత్తులో ఐఐటీకి సన్నద్ధమవ్వాలనుకుంటే తమ శిక్షణా సంస్థ ఆమెకు ఆహ్వానం పలుకుతుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దారుణం: కరోనా పోవాలని నరబలి!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ గుడి పూజారి వ్యక్తిని బలిచ్చాడు. గుడిఆవరణలోనే అతడిని హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

10. మరో పెనువివాదంలో చైనా..!  

హాంకాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం హక్కులను  కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.  హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.