ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభం
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌ నిజామియా హాస్పిటల్‌లో ఇవాళ్టి నుంచి కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 250 శాంపిల్స్‌ సేకరించాలని లక్ష్యంగా నిర్థేశించారు. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, బాలాపూర్‌ యూపీహెచ్‌సీ, మహేశ్వరం సీహెచ్‌సీలలో రోజుకు 150 శాంపిల్స్‌ చొప్పున సేకరించాలని నిర్ణయించారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 50వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో  ఈనెల 16 నుంచి తొమ్మిది రోజుల పాటు దాదాపు 36వేల నమూనాలు సేకరించారు.  దీంతో ప్రయోగశాలలు రోజంతా పనిచేసినా .. సేకరించిన నమూనాలను పరీక్షించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నమూనాల సేకరణను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పెండింగ్‌లో ఉన్న నమూనాల పరీక్షలు పూర్తికావడంతో తిరిగి ఇవాళ్టి నుంచి శాంపిల్స్‌ సేకరణ పునఃప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని