close

తాజా వార్తలు

Published : 30/01/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌.. ఆ కంపెనీ షేర్లు ట్రిపుల్‌!

టోక్యో: చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్త మార్కెట్లు డీలా పడిన వేళ జపాన్‌లో మాత్రం ఓ కంపెనీ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఆ కంపెనీ దాదాపు మూడు రెట్ల లాభాలను నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌కు చెందిన కవమోటో కార్పొరేషన్‌ వైద్య పరికరాలను తయారుచేస్తుంది. ఇటీవల చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ కారణంగా ముఖానికి తగిలించుకునే మాస్కులకు భారీగా డిమాండు పెరిగింది. దీంతో కంపెనీ గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు రెట్ల లాభాలను నమోదు చేసినట్లు సమాచారం. జపాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ (జేపీవై)లో మంగళవారం ఈ సంస్థ మార్కెట్‌ షేర్లు 23.65శాతం పెరగాయి. అదేవిధంగా అమెరికాకు చెందిన మరో వైద్య పరికరాల తయారీ సంస్థ అల్ఫా ప్రో టెక్‌ లిమిటెడ్‌ సైతం జనవరి 17 మార్కెట్‌ షేర్లతో పోలిస్తే ప్రస్తుతం 2.2 రెట్ల లాభాల్ని నమోదు చేసింది. సోమవారం నాడు ఈ కంపెనీ షేర్లు దాదాపు 28శాతం పెరిగినట్లు సమాచారం. 

చైనాలో వేగంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి ఇప్పటికే 132 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 6వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతుండటంతో చైనా అధికారులు ముఖానికి మాస్కులు ధరించమని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో వాటికి బాగా డిమాండు పెరిగడం గమనార్హం. 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని