close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/02/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

ఇండియన్‌ పాలిటీ

ప్రాథమిక హక్కులు

1. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?

1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.

2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.

3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.

4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.

2. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?

1) సైనిక, పారామిలటరీ దళాలు 2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు

3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 4) పైవన్నీ

3. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?

1) న్యాయ శాసనం 2) సైనిక శాసనం 3) కార్గో శాసనం 4) కామన్‌ శాసనం

4. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?

1) హెబియస్‌ కార్పస్‌ 2) మాండమస్‌ 3) సెర్షియోరరీ 4) కోవారెంటో

5. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?

1) సెర్షియోరరీ 2) ప్రొహిబిషన్‌ 3) కోవారెంటో 4) హెబియస్‌ కార్పస్‌

6. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?

1) ప్రొహిబిషన్‌ 2) సెర్షియోరరీ 3) మాండమస్‌ 4) కోవారెంటో

7. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?

1) సెర్షియోరరీ 2) ప్రొహిబిషన్‌ 3) 1, 2 4) మాండమస్‌

8. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?

1) కోవారెంటో 2) మాండమస్‌ 3) సెర్షియోరరీ 4) హెబియస్‌ కార్పస్‌

9. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?

1) ప్రభుత్వ వ్యక్తులు 2) ప్రైవేట్‌ వ్యక్తులు 3) 1, 2 4) ఏదీకాదు

10. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?

1) హెచ్‌.జె. లాస్కి 2) జాన్‌లాక్‌ 3) రూసో 4) అరిస్టాటిల్‌

11. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?

1) అమికస్‌ క్యూరీ 2) రిట్‌ 3) ఇంజక్షన్‌ 4) స్టే ఆర్డర్‌

12. PIL అంటే?

1) Proper Interest Log 2) Public Interest Litigation

3) Public Information Litigation

4) Policy Information Litigation

13. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?

1) అమెరికా 2) ఆస్ట్రేలియా 3) బ్రిటన్‌ 4) కెనడా

14. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?

1) జస్టిస్‌ బి.పి. సిన్హా 2) జస్టిస్‌ కోకా సుబ్బారావు

3) జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి 4) జస్టిస్‌ పతంజలి శాస్త్రి

15. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?

1) సుమోటో 2) అమికస్‌ క్యూరీ 3) లోకస్‌స్టాండి 4) ప్రజా ప్రయోజన వ్యాజ్యం

సమాధానాలు: 1-2; 2-4; 3-2; 4-1; 5-3; 6-1; 7-3; 8-2; 9-3; 10-1; 11-3; 12-2; 13-1; 14-3; 15-1.

- బంగారు సత్యనారాయణ

ఇంటర్మీడియట్‌ మోడల్‌ పేపర్లు

సంవత్సరాంత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరూ ఎంతో చదివారు. ఇంకా చదువుతున్నారు. ఎవరి బలాలు, బలహీనతలూ వారు తెలుసుకొని సరైన దిశగా ప్రిపరేషన్‌ను సాగించాలంటే మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడే విధంగా నిపుణులు రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాలు నేటి నుంచి ‘ప్రతిభ’ పేజీల్లో.

మరిన్ని మోడల్‌ పేపర్ల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.