close

తాజా వార్తలు

Published : 02/03/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Gadget: రెడ్‌మీ నోట్‌9 వచ్చేస్తోంది..

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ నుంచి నోట్‌ సిరీస్‌ ఫోన్లు అందరికీ సుపరచితమే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లకు దేశంలో మంచి డిమాండ్‌ ఉంది. రెడ్‌మీ నోట్‌ 4జీతో మొదలై.. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నోట్‌ 8, నోట్‌ 8 ప్రో వరకు ఫోన్లు వచ్చాయి. తాజాగా ఈ సిరీస్‌ నుంచి నోట్‌ 9 త్వరలో రాబోతోంది. మార్చి 12న జరిగే కార్యక్రమంలో నోట్‌ 9 సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌ ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఫోన్‌ను టీజ్‌ చేస్తూ ఓ పోస్టర్‌ పెట్టారు.

దీని ప్రకారం.. ఇందులో వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఇది వరకు వచ్చిన నోట్‌ 8 సిరీస్‌లో క్వాడ్‌ కెమెరా అమర్చినప్పటికీ నోట్‌9 సిరీస్‌లో దీర్ఘచతుర్రాసాకారంలో కెమెరా సెటప్‌ తీసుకొస్తున్నారు. ఇది ఐఫోన్‌ 11 ప్రోను పోలి ఉంది. గతంలో లాగానే నోట్‌ 9తో పాటు నోట్‌ 9 ప్రోను కూడా ఈ సారి విడుదల చేయనున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశీయంగా చైనా కంపెనీలైన రియల్‌మీ, ఐక్యూ బ్రాండ్లు ఇప్పటకే 5జీ ఫోన్లు విడుదల చేశాయి. రియల్‌మీ సైతం 6 సిరీస్‌లో ఫోన్లు లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. దీంతో తామూ రేసులో ఉన్నామూంటు నోట్‌9 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ చేస్తున్నట్లు షావోమీ ప్రకటన చేయడం గమనార్హం.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.