close

తాజా వార్తలు

Updated : 13/03/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దర్శకేంద్రుడికి సారీ చెప్పిన పూరి

అసలేమైందంటే..

హైదరాబాద్‌: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్షమాపణలు చెప్పారు. రాఘవేంద్రరావుకి పూరీ క్షమాపణలు చెప్పడానికి గల కారణమేమిటంటే.. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. అప్పటి నుంచి ఎందరో అగ్రకథానాయకుల సరసన నటించడమే కాకుండా.. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో సైతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారామె. అనుష్క త్వరలో ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుష్క వెండితెరకు పరిచయమై 15 సంవత్సరాలైన సందర్భంగా గురువారం ‘15 ఇయర్స్‌ ఆఫ్‌ అనుష్కశెట్టి’ అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అనుష్కతో తమకి ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్‌.. అనుష్క నటించిన ‘నమో వెంకటేశాయ’ చిత్రంతోపాటు దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాఘవేంద్రరావుగారు నా మొదటి సినిమా పూజా కార్యక్రమానికి వచ్చి క్లాప్‌ కొట్టి, నన్ను ఆశీర్వదించారు. అప్పుడు ఆయన  ‘నీ పేరు ఏంటి?’ అని అడిగారు. ‘సర్‌ నా పేరు జగన్‌’ అన్నాను. ‘ఈ గడ్డం ఉంటే తమిళోడివి అనుకున్నాను’ అని ఆయన అన్నారు. ‘సర్‌ మీకూ గడ్డం ఉంది. మేము అనుకోవడం లేదు కదా సర్‌’ అన్నాను. వెంటనే ఆయన.. ‘నీకు వెటకారం ఎక్కువైంది’ అని సరదాగా తిట్టారు. ఆ తర్వాత ‘సూపర్‌’ సినిమా టైంలో రాఘవేంద్రరావు గారు, నేను కలిశాం. ఆయన్ని చూసిన వెంటనే ‘ఎందుకు వచ్చారు సర్‌’ అని అడిగాను. ‘నాగార్జున డేట్స్‌ కోసం వచ్చాను’ అన్నారు. ‘సర్‌.. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మీరు దర్శకత్వం వహించిన ‘అడవిరాముడు’ సినిమా చూశా. మళ్లీ ఇప్పుడు నేను డైరెక్టర్‌ అయ్యి సినిమా చేస్తుంటే నాగార్జున డేట్స్‌ ఎందుకు సర్‌. మీరు రిటైర్‌ అయిపోండి సర్‌’ అని అన్నాను. ఆయన వెంటనే నవ్వి నా భుజం తట్టి నాగార్జున డేట్స్‌ తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నాగార్జున మా ఇద్దరికీ డేట్స్‌ ఇచ్చారు. అప్పుడు నేను ఫ్లాప్‌ సినిమా చేశాను. ఆయన మాత్రం బ్లాక్‌బస్టర్‌ సినిమా తెరకెక్కించారు. ఆసమయంలో నేను వాగిన దానికి ఇప్పుడు మీ అందరి ముందు రాఘవేంద్రరావు గారికి క్షమాపణలు చెబుతున్నాను’ అని పూరీ అన్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.