వేప.. శ్రీమహాలక్ష్మి!
close

తాజా వార్తలు

Updated : 19/03/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేప.. శ్రీమహాలక్ష్మి!

శతాయుర్వజ్రదేహాయ

సర్వసంపత్కరాయచ

సర్వారిష్ట వినాశాయ

నింబకుసుమ భక్షణం!!

ఆరోగ్యమే మహా భాగ్యం... అందుకే వేప లక్ష్మీ స్వరూపమైంది. చెట్టంతా చేదైనా ఎన్నో ఔషధ విలువలు నిక్షిప్తం చేసుకుని ఇంటింటా ఉండాల్సిన దైవ వృక్షమైంది. అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతీయుల జీవనంలో ముఖ్యభాగమైన వేపను గురించిన విశేషాలు వరాహ మిహిరుడు, శుశ్రుతుడి రచనల్లో, చరక సంహితలో మనకు కనిపిస్తాయి.

* వేపను లక్ష్మీ స్వరూపంగా భావించడం వెనుక ఓ పురాణగాథను చెబుతారు. ఓసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడు. దీంతో కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి ‘మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే. వాళ్లంతా వృక్షాలుగా మారిపోవుదురుగాక’ అని శపించింది. దీంతో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు. వారిలో శ్రీమహావిష్ణువు అశ్వత్థవృక్షంగా, ఆయన దేవేరి లక్ష్మీదేవి వేప చెట్టుగా మారినట్లు కథనం.

* వేపకు సంస్కృతంలో నింబ వృక్షం అనిపేరు. ఇంకా అరిష్ట, క్రిమిఘ్న, పీచుమర్థ అనే పేర్లున్నాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సూర్యభగవానునితో సమానమైన శక్తి ఉంది కాబట్టి రవి సన్నిభ అనే పేరు వచ్చింది. తన నీడ వల్ల శ్రమను దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చినట్లు కథనం.

* బహిరంగ ప్రదేశాల్లో, పెరట్లో, తోటల్లో అయిదు చెట్లు ఉండాలని వరాహమిహిరుడు పేర్కొన్నాడు. అందులో వేప ఒకటి. అశోక, శిరీషం (దిరిసెన), పున్నాగ (పొన్న), ప్రియాంగు... మిగిలిన చెట్లు. వీటిలో వేటికవే ఎన్నో ప్రయోజనాలనిస్తాయి.

* ఉగాదినాటి విధుల్లో నింబ కుసుమ (వేప పువ్వు) భక్షణం ప్రధానమైందిగా చెబుతారు.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని