close
Array ( ) 1

తాజా వార్తలు

చేద్దామా...గుండీల బుట్ట

బెలూన్లు ఊదితే భలే సరదాగా ఉంటుంది కదూ! బెలూన్లతో చిన్న బుట్ట తయారు చేయొచ్చు తెలుసా? అదీ గుండీలు ఉపయోగించి! వింతగా ఉంది కదూ! మరి మీరూ నేర్చుకుంటారా?!
  చేయాల్సిన విధానం:
* ముందుగా బెలూన్‌ను తీసుకుని దానిలో గాలి ఊదండి.
* దాని మొదలు దారంతో ముడి వేయండి.
* ఇప్పుడు చిత్రంలో చూపించినట్లు బెలూన్‌ను డబ్బాలో పెట్టండి.
* గాలి ఊదే భాగం డబ్బా లోపల ఉండేలా చూసుకోవాలి.
* ఇప్పుడు నెమ్మదిగా బెలూన్‌ పావు భాగం వరకు జిగురు (గమ్‌) రాయండి.
* చాలా జాగ్రత్తగా ఈ పని చేయాలి. బెలూన్‌ పగిలిపోకుండా చూసుకోవాలి.
* ఎందుకంటే గమ్‌ అంతా మీద పడే అవకాశం ఉంది మరి.
* మీకు కష్టంగా ఉంటే అమ్మానాన్న సహాయం తీసుకోండి.
* తర్వాత ఇంట్లో ఉన్న పాత గుండీలను ఒక్కోటి అతికించండి.
* ఇలా అతికించేటప్పుడు గుండీలన్నీ దగ్గరగా ఒకదాని కొకటి తాకేలా చూసుకోవాలి.
* ఇప్పుడు ఓ మూడు నాలుగు గంటలు ఆరనివ్వండి.
* పూర్తిగా ఆరిన తర్వాత బెలూన్‌ నుంచి నెమ్మదిగా గాలి తీసేయండి.
* ఇంకేం గుండీల బుట్ట సిద్ధం. ఇప్పుడు దీన్ని మీ స్టడీ రూంలో పెట్టుకుని స్లేట్‌ పెన్సిళ్లు, పెన్సిళ్లు, పెన్నులు, రబ్బర్లు, షార్ప్‌నర్లు.. ఇలా మనకు నచ్చినవి ఇందులో దాచుకోవచ్చు.
కావాల్సిన వస్తువులు
1.బెలూన్‌ 2.దారం 3.డబ్బా 4.రంగురంగుల గుండీలు 5.జిగురు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.