close

తాజా వార్తలు

Published : 10/06/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

30 సెకన్ల వరకు నో మాస్క్‌

మధ్యప్రదేశ్‌ని బ్యాంకులు, నగల దుకాణాల్లో కొత్త రూల్‌

భోపాల్‌: బ్యాంకులు, నగల దుకాణాలకు వచ్చేవారు 30 సెకన్లపాటు మాస్కును తొలగించాల్సిందిగా మధ్యప్రదేశ్‌ రాష్ర్టం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యాంకులు, నగల దుకాణాల్లోని సీసీ కెమెరాల్లో సందర్శకుల ముఖాలు సీసీ టీవీల్లో రికార్డయ్యేందుకు వీలుగా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు రెండు నెలల కఠిన లాక్‌డౌన్ అనంతరం సడలింపులు ఇవ్వడంతో బ్యాంకులు, ఆభరణాల దుకాణాలను సందర్శించేవారి సంఖ్య పెరుగుతుండటంతో వారిని గుర్తించేందుకే ఈ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.  అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేసింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 10వేల కరోనా కేసులు నమోదవగా 400 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కొవిడ్‌-19 విస్తరణలో ఆ రాష్ర్టం ఏడో స్థానంలో నిలిచింది. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.