స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
close

తాజా వార్తలు

Updated : 25/06/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26 పాయింట్లు నష్టపోయి, 34,842 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,288 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతోంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 343 పాయింట్లు కోల్పోయి 34,525 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 10,235 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఆ తర్వాత ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగాయి. దేశంలో అన్‌లాక్‌ కారణంగా కరోనా వైరస్‌ కేసులు నానాటికీ పెరిగిపోతుండటం మార్కెట్ల పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు జూన్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు నేటితో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రపంచ జీడీపీ ఏప్రిల్‌లో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పతనం కానుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పేర్కొంది. ఈ విషయమూ మార్కెట్లను భయపెట్టింది. దీంతో ఒకానొక దశలో సెన్సెక్స్‌ 34,499 పాయింట్లుకు పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నా చివరకు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గురువారం నాటి ట్రేడింగ్‌లో ఐటీసీ, కొటక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌ తదితర షేర్లు లాభపడగా, ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో, ఐవోసీ, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని