నా అపార్ట్‌మెంట్‌ దాటి వెళ్లడం లేదు: కమల్‌
close

తాజా వార్తలు

Published : 29/03/2020 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా అపార్ట్‌మెంట్‌ దాటి వెళ్లడం లేదు: కమల్‌

అతిగా సినిమాలు చూస్తున్నా

చెన్నై: రోజుకు కనీసం ఒక్క సినిమా చూడనిదే నిద్రపోనని విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఈ సమయాన్ని ఎలా గడుపుతున్నారని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ‘నేను అన్ని రకాల చిత్రాల్ని చూస్తా. ఓ రోజులో కనీసం రెండు చిత్రాలు, నిద్రపోవడానికి ముందు కనీసం ఒక్క చిత్రం అయినా చూడాల్సిందే. ఇప్పుడు ఇంటిలోనే ఉంటున్నా కాబట్టి అతిగా సినిమాలు చూస్తున్నా. రోజుకు నాలుగు సినిమాలు చూస్తున్నా’.

‘నా జీవితాన్ని మార్చేసిన, ప్రభావితం చేసిన సినిమా పేర్లు చెప్పమని స్నేహితులు అడుగుతుంటారు. హాలీవుడ్‌ సినిమాల్ని వారికి సూచిస్తుంటా. ‘సోల్జర్ బ్లూ’ అనే పాత చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లోనే సమాజంలోని సమస్యల గురించి మాట్లాడిన ప్రాథమిక చిత్రాల్లో ఇదొకటి’.

‘అదేవిధంగా లాక్‌డౌన్‌ కాలాన్ని ఇంకా ఫిట్‌గా తయారు కావడానికి ఉపయోగిస్తున్నా. నా ఇంటిపై చాలా స్థలం ఉంది. అక్కడ ఎండలో బాగా వాకింగ్‌ చేయొచ్చు. నా అపార్ట్‌మెంట్‌ను దాటి బయటికి వెళ్లడం లేదు. నేను జిమ్‌కు వెళ్లి ఆరు రోజులవుతోంది. ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నా. ఆకలిగా అనిపిస్తేనే తింటాను.. అదే పనిగా కూర్చుని తినే వ్యక్తిని కాదు’ అని కమల్ చెప్పారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని