కరోనా ఎఫెక్ట్‌:ముంబయి ఆస్పత్రుల్లో భారీమార్పు
close

తాజా వార్తలు

Updated : 14/05/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌:ముంబయి ఆస్పత్రుల్లో భారీమార్పు

వైరస్‌ సోకినవారి మధ్య దూరం అవసరమా? అంటోన్న అధికారులు

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఈ మహమ్మారి సోకిన రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోవడంతో పాటు భౌతికదూరం నిబంధనలూ పక్కన పెట్టాల్సిన దీనావస్థ  నెలకొంది. ముంబయి నగరంలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన 3500 పడకలు పూర్తిగా నిండిపోయాయి. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో పడకలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పడకల మధ్య దూరాన్ని తగ్గించేశాయి. కరోనా వైరస్‌ సోకిన రోగుల మధ్య ఇంకా భౌతిక దూరం ఎందుకు? అని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అదే ఉద్దేశంతో రోగుల పడకల మధ్య దూరం తగ్గించడం ద్వారా  24 గంటల్లోనే కొత్తగా 1500 బెడ్‌లు ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో నాయర్‌ ఆస్పత్రిలో 336గా ఉన్న పడకల సంఖ్య 800కి పెరిగింది. అలాగే, కేఈఎం ఆస్పత్రిలో 200 నుంచి 220, సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రిలో పడకల సంఖ్య 400  నుంచి 690కు.. ఇలా పలు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచారు.

 అలాగే, కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన 250 వెంటిలేటర్లు వినియోగంలో ఉండటంతో వీటికీ కొరత ఏర్పడింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్స్‌ (సీసీయూ)కు 200 వెంటిలేటర్‌ పడకలను ఏర్పాటు చేయాలని ఆయా యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యధిక కేసులు ముంబయిలోనే నమోదువుతున్నాయి. ఈ  నెలాఖరు నాటికి ముంబయిలోనే కరోనా బాధితుల సంఖ్య 50వేలకు చేరువయ్యే అవకాశం ఉంది.  ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం 921 మరణాలు నమోదు కాగా.. వాటిలో 556 మరణాలు ముంబయిలోనే కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని