close

తాజా వార్తలు

Published : 09/07/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యక్తిగత చిత్రాలు, వీడియోలతో వేధింపులు

నాగోలు: ఓ బాలికకు చెందిన వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమెను వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రాము కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన దానబోయిన శుభం యాదవ్‌(20) మూడేళ్లక్రితం కోఠిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదివే సమయంలో ప్రేమ పేరిట సహ విద్యార్థిని వెంట పడ్డాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆ బాలిక వ్యక్తిగత చిత్రాలు.. వీడియోలు తెప్పించుకున్నాడు. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించి కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసి గొడవైంది. అయినా బుద్ధి మార్చుకోని శుభం యాదవ్‌ తిరిగి ఆమెను బెదిరించి పదో తరగతి చదువుతున్న ఆమె సోదరి వ్యక్తిగత చిత్రాలు సైతం పంపమని బెదిరించాడు. ఆ బాలిక తన సోదరి  వీడియోలు అతనికి పంపడంతో  నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆమె సోదరికి సైతం ఆ వీడియోలు, స్క్రీన్‌ షాట్‌ ఫోటోలు పంపి వేధించసాగాడు. దీంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు  నిందితుడిని మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని