కరోనా సేవలందించిన వైద్యుడు మృతి
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సేవలందించిన వైద్యుడు మృతి


డాక్టర్‌ ఫైజల్‌ అన్సారీ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వేళ వైద్య సేవలందించిన వైద్యుడు అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఆయన తండ్రి కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. సైదాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఫైజల్‌ అన్సారీ(41) పంజాగుట్ట నిమ్స్‌లో మైక్రోబయాలజీ విభాగంలో సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులుగా సేవలందించారు. కరోనా తొలి దశ లో ఇక్కడ పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విధులకు గడువు ముగియడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా సోకగా హోంఐసొలేషన్‌లో ఉంటున్నారు. శనివారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు ఆయనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఆసుపత్రికి వెళ్లిన తరువాత పడక కోసం గంట ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, అంబులెన్స్‌లోనే ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆయన తండ్రి అబ్దుల్‌ వహీద్‌(70) మహమ్మారి బారిన పడి నెల కిందటే పూర్తిగా కోలుకున్నారు. ఫైజల్‌ కోలుకొని సాధారణ స్థితికి వస్తారని కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నా.. అడియాశలయ్యాయి. ఆయనకు భార్య, కుమారుడు(11), కుమార్తె(2) ఉన్నారు. ఆయన మృతిపై నిమ్స్‌ వైద్యులు సంతాపం ప్రకటించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని