close

తాజా వార్తలు

Published : 04/03/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. అమ్ముడు.. కొనుడు

షేర్‌ మార్కెట్లో లావాదేవీల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోనూ భూముల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేయడంతో భూ విక్రయాలు పెరిగాయి. ధరణి పోర్టల్‌ ద్వారా ఏక కాలంలో సేవలను అందించడం విక్రయదారులతోపాటు కొనుగోలుదారులకు కూడా కలిసి వస్తోంది. దీంతో కొందరు భూములను కొనుగోలు చేసి విక్రయించడాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. నగరం చుట్టూ ఉన్న జిల్లాల్లో ఈ వ్యాపారం రోజురోజుకు పుంజుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యథేచ్ఛగా బెదిరింపులు

ఏపీ పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం కూడా బెదిరింపుల పర్వం కొనసాగింది. ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడి కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు తెదేపా నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. వారిని రహస్య ప్రదేశాలకు పంపించి.. గడువు ముగిశాకే స్వస్థలాలకు తీసుకొచ్చారు. అయినా కొన్నిచోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో.. డమ్మీ అభ్యర్థులుగా, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి బి-ఫారాలు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏకగ్రీవాల జోరు

3. అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌!

విశ్వ యాత్రికుల కోసం అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌ నిర్మించేందుకు సిద్ధమవుతోంది ఓ సంస్థ. మరో ఆరేళ్లలో అంటే 2027 నాటికి అంతరిక్ష అతిథులకు స్వాగతం పలుకుతామని వెల్లడించింది. ఒకప్పుడు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నారంటే గొప్ప విషయంగా కనిపించేది. ఇప్పుడు అదేదో పొరుగునే ఉన్న ఊరుకి వెళ్లి వచ్చినంత సులభంగా వెళ్లి వస్తున్నారు. సామాన్యులను సైతం అంతరిక్షానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పేస్‌ ఎక్స్‌ సహా పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరి అక్కడ వారందరూ బస చేయడానికి వసతులు కావాలి కదా! అందుకే ‘ఆర్బిటల్‌ అసెంబ్లీ’ అనే సంస్థ అంతరిక్షంలో స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎడారి వెళ్లిపొమ్మంది

కలలు కరుగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత అయిదేళ్లలో 4.5 లక్షల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఈ కాలంలో అక్కడికి వెళ్లిన వారి సంఖ్య 5900 మాత్రమే. 2020లో వెళ్లిన వారు కేవలం 330 మందేనని తేలింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజా గణాంకాలివి. ఆర్థిక సంక్షోభం, ఇతర ప్రతికూల పరిస్థితులకు తోడు గత ఏడాది కరోనా మహామ్మారి వలస జీవులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్‌ దేశాల్లోని 30 శాతం మంది వరకు ప్రవాస భారతీయులే కాగా అందులో 4 శాతం వరకు తెలంగాణ వారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అదానీ చేతికి గంగవరం పోర్టు?

ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుంది. ఈ పోర్టు కంపెనీలో 31.5% వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గంగవరం పోర్ట్‌ కంపెనీలో 16.3 కోట్ల షేర్లు అదానీ సంస్థ చేతికి రానున్నాయి. ఒక్కో షేరును రూ.120 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌-మేజర్‌ పోర్టు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వ్యవస్థలపై చైనా హ్యాకర్ల గురి

చైనా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. భారతదేశ వ్యవస్థను అస్థిరపరచటమే కాదు, మేధో హక్కులను (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ) సొంతం చేసుకోవటానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. మన సాంకేతిక వ్యవస్థల్లోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నారు. చైనాకు చెందిన థ్రెట్‌ యాక్టర్‌ హ్యాకింగ్‌ గ్రూపు విద్యుత్‌ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని కంప్యూటర్‌ రెస్పాన్స్‌ టీం ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ- ఇన్‌) అప్రమత్తం చేసిన నేపథ్యంలో, ఈ అంశం మరోమారు చర్చకు వచ్చింది. ఈ హ్యాకింగ్‌ సంస్థల్లో ఎక్కువ ప్రభుత్వ ప్రోత్సాహంతో నడుస్తున్నవే కావటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. లీటరుకు రూ.8.50 తగ్గించవచ్చు

రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల నుంచి ప్రజలకు ఊరట కలిగించాలని ప్రభుత్వం అనుకుంటే ఆదాయాన్ని నష్టపోకుండానే ఆ పని చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లీటరుకు రూ.8.50 తగ్గించినా కూడా బడ్జెట్‌ ప్రభావితం కాదని వారు గణాంకాలతో చెబుతున్నారు. మోయలేనంతగా పెరిగిపోయిన భారాన్ని తగ్గించాలని వివిధ వర్గాలు కోరుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రధాని ఫొటో తొలగించండి

8. తవ్విన కొద్దీ ‘నిజాలు’!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బీమా మాఫియాపై విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన 20 మందికి పైగా నిందితులను నల్గొండ పోలీసులు నాలుగురోజుల నుంచి విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది వరకు అమాయకులను హత్య చేసి వారు ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించి బీమా సొమ్మును క్లెయిమ్‌ చేశారని తేలింది. నిందితులు తాజాగా మిర్యాలగూడ, నల్గొండతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, దాచేపల్లి, మాచర్ల ప్రాంతాల్లోనూ మరి కొంతమందిని ఇలాగే పొట్టనబెట్టుకున్నట్లు అంగీకరించారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొవాగ్జిన్‌ టీకా ప్రభావశీలత 81%

భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకా 81 శాతం ప్రభావశీలత కనబరచింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం నిర్థారణ అయినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటన్నేషనల్‌ బుధవారం వెల్లడించింది. ‘కొవిడ్‌-19 వ్యాధిని నిరోధించడంలో కొవాగ్జిన్‌ టీకా 81 శాతం ప్రభావశీలత ప్రదర్శించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో మనదేశంలో నిర్వహించిన అతిపెద్ద  క్లినికల్‌ పరీక్ష ఇది’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొడితే లార్డ్స్‌కే..

పిచ్‌ చర్చలకు ఇక తెరదించాల్సిందే.. వాదోపవాదాలకు ఇక విరామం ఇవ్వాల్సిందే.. ఊహాగానాలకు ఇక సెలవివ్వాల్సిందే! ఎందుకంటే మొతేరాలో మళ్లీ ఆట మొదలు కాబోతోంది. రెండు రోజుల్లో మూడో టెస్టు ముగిసిపోయిన అదే వేదికలో గురువారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ చివరి టెస్టులో తలపడబోతున్నాయి. గత టెస్టులా ఇది డేనైట్‌ టెస్టు కాదు కాబట్టి మ్యాచ్‌ రెండు మూడు రోజుల్లో ముగిసిపోతుందన్న అంచనాలేమీ లేవు. కానీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఊరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లిష్‌ జట్టును భారత్‌ మరోసారి స్పిన్‌ పిచ్‌తో దెబ్బ కొట్టాలనే చూడొచ్చు. ఈ మ్యాచ్‌ను కోహ్లీసేన డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం లార్డ్స్‌లో అడుగు పెడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని