
తాజా వార్తలు
ఇంటి అద్దెల వృద్ధిలో హైటెక్‌సిటీ టాప్
దిల్లీ: దేశంలోని ప్రధానమైన ఏడు నగరాల్లో విలాసవంతమైన ప్రాంతాల ఇంటి అద్దెల వృద్ధిలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మొదటిస్థానంలో ఉంది. 2014-20 మధ్య దేశవ్యాప్తంగా ఈ నగరాల్లో అద్దెల వృద్ధి 12 శాతం ఉండగా, హైటెక్‌సిటీలో అద్దెలు 26 శాతం వృద్ధి కనబరిచినట్లు అనరాక్ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాలకు సంబంధించిన లగ్జరీ ప్రాంతాల అద్దె, ఇంటి విలువ పెరుగుదల నివేదికను అనరాక్ విడుదల చేసింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్‌లో 15 శాతం అద్దెలు పెరిగాయి. బెంగళూరులోని రాజానగర్‌లో ఇంటి విలువ అత్యధికంగా 22 శాతం పెరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఇంటి విలువ, మూలధన పెరుగుదల 12 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2020 ఏడాదిలో మొత్తం అన్ని నగరాల్లో అద్దె విషయంలో ఎలాంటి మార్పు లేదని నివేదిక పేర్కొంది.
ఇవీ చదవండి
Tags :