న్యాయవాదుల హత్య కేసు: ఏ1గా కుంట శ్రీను
close

తాజా వార్తలు

Published : 19/02/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయవాదుల హత్య కేసు: ఏ1గా కుంట శ్రీను

కేసు వివరాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో మహారాష్ట్ర సరిహద్దులో నిందితులు కుంట శ్రీను, శివందుల చిరంజీవిని.. ఆ తర్వాత వారికి సహకరించిన అక్కపాక కుమార్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. సాంకేతికత సాయంతో 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. పెద్దపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వివరించారు. 

‘‘న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనుది గుంజపడుగు గ్రామం. గ్రామంలో వీరిద్దరి మధ్య చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. గ్రామంలోని ఆలయ భూమి విషయంలో ప్రధానంగా వివాదముంది. ఈ విషయంలో న్యాయపరంగా శ్రీనుని వామన్‌రావు గట్టిగా ఎదుర్కొంటున్నారు. దాన్ని తట్టుకోలేక వామన్‌రావును హత్య చేయాలని శ్రీను నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. విచారణలో శ్రీను ఎక్కడా రాజకీయ కారణాలు చెప్పలేదు. శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశారు. శ్రీనుపై కొన్ని పాతకేసులున్నాయి. ఈ కేసులో ఏ1గా ప్రధాన నిందితుడు కుంట శ్రీను, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌ను చేర్చాం. హత్యకి వాడిన వాహనం బిట్టు శ్రీను అనే వ్యక్తిది. ఇంకా విచారణ కొనసాగుతోంది. మిగతా నిందితుల పాత్రపై పూర్తి విచారణ అనంతరం చెబుతాం’’ అని ఐజీ తెలిపారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని