కొవిషీల్డ్ టీకా: 4-8 వారాల్లో రెండో డోసు
close

తాజా వార్తలు

Updated : 22/03/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిషీల్డ్ టీకా: 4-8 వారాల్లో రెండో డోసు

దిల్లీ: కరోనా టీకా కొవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య వ్యవధిని 4-8 వారాలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ వ్యవధి కేవలం కొవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుందని దానిలో పేర్కొంది. 

‘కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి గురించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ), నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19(ఎన్‌ఈజీవీఏసీ) మరోసారి సమీక్ష జరిపింది. పలు శాస్త్రీయ ఆధారాల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ జరిగింది’ అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులుగా ఉంది. అయితే, 4-8 వారాల వ్యవధిలో రెండో డోసును అందిస్తే రక్షణ మరింత మెరుగవుతుందని తెలిపింది. ఆ సమయం ఎనిమిది వారాలు మించరాదని సూచించింది.

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్రం జనవరి 16 నుంచి మొదటి దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి ఒకటిన రెండో దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను అత్యవసర వినియోగం కింద వాడుతున్నారు. ఇప్పటివరకు 4.50 కోట్ల మందికి టీకా డోసులను పంపిణీ చేశారు. 28 రోజుల వ్యవధితోనే ఈ రెండు టీకాలను అందిస్తున్నారు.

మరోవైపు, దేశంలో రెండో దఫా కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 46,951 మందికి  వైరస్‌ సోకగా..ఒక్క మహారాష్ట్రలోనే 30వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. 212 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విజృంభణను అడ్డుకునేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలవైపు మొగ్గు చూపుతున్నాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని