close
Array ( ) 1

తాజా వార్తలు

ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమా?: కళా

అమరావతి: కరోనాపై తప్పుడు లెక్కలతో ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులపై కాకి లెక్కలు చెబుతూ రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను ధ్వంసం చేస్తున్న వైకాపా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సకాలంలో వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదా?అని నిలదీశారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం కూడా సరిగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సకాలంలో వైద్యం అందక కర్నూలు జిల్లాలో ఓ బాలింత, నెల్లూరు జిల్లాలో శివ సాగర్ అనే వ్యక్తి చనిపోయారని కళా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం. వైద్య రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం’ అంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్‌..ఈ ఘటనలకు సమాధానం చెప్పాలని కళా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అత్యవసర సేవలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయం చూపడం లేదని కళా విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడల కారణంగా వైద్యులు ఆస్పత్రులకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారన్నారు. వైద్యులకు రక్షణ పరికరాలు, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా వృత్తిధర్మం పాటించి వారు వైద్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పోకడల ఫలితంగా పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆరోపించారు. వైద్యులంటే వైకాపా ప్రభుత్వానికి చులకన భావం కాబట్టే ఇన్ని దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే జగన్‌కు రాజకీయాలే ముఖ్యమా? అని కళా నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన ప్రతిపక్షాలపై వైకాపా సర్కార్‌ ఎదురుదాడికి దిగుతోందని ఆయన దుయ్యబట్టారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.