కరోనా రోగులకు చికిత్స చేయకపోతే ఊరుకోం! 
close

తాజా వార్తలు

Published : 17/04/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా రోగులకు చికిత్స చేయకపోతే ఊరుకోం! 

పడకలు రిజర్వు చేయాల్సిందే..

ప్రైవేటు ఆస్పత్రులకు కర్ణాటక వైద్యశాఖ మంత్రి వార్నింగ్‌

బెంగళూరు: దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు దొరక్క రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ప్రైవేటు ఆస్పత్రులకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కరోనా రోగులకు ఆస్పత్రుల్లో పడకలు రిజర్వు చేసి ఉంచకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కట్టడి గురించి నిపుణులతో చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు ఎక్కువ పడకలు రిజర్వు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఎక్కువ పడకలు కరోనా రోగుల కోసం రిజర్వు చేయాలని గత 15 రోజులుగా కోరుతున్నామన్నారు. కానీ వారు కేవలం 15 నుంచి 20శాతం మాత్రమే కేటాయిస్తున్నారని మండిపడ్డారు.

దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని, ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై గతేడాది మాదిరిగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే నాన్‌ కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని సూచించారు. కరోనా రోగులకు అవసరమైన వైద్యం అందించకపోతే మౌనంగా చూస్తూ కూర్చోబోమన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి గుర్తుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని