దీదీ.. ఇప్పుడు దెబ్బతిన్న పులి: శివసేన
close

తాజా వార్తలు

Published : 13/03/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీదీ.. ఇప్పుడు దెబ్బతిన్న పులి: శివసేన

ముంబయి: ‘‘దెబ్బతిన్న పులి మరింత దూకుడుగా ఉంటుంది. వాడిగా పంజా విసురుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. ఆమె గాయం.. ప్రత్యర్థులకు భారంగా మారనుంది’’ అని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. మమతపై దాడి ఘటనపై స్పందించిన శివసేన.. తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో భాజపాపై ఘాటు విమర్శలు చేసింది. 

‘‘బెంగాల్‌ ఎన్నికల కోసం భాజపా తమ మొత్తం బలగాన్ని దించుతోంది.  మమతను రౌండప్‌ చేసే ఏ ప్రయత్నాలను వదలట్లేదు. దీంతో దీదీ పార్టీ రోజురోజుకీ విడిపోతుంది. అయినా ఆమె తన సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోరు.. దీదీ వర్సెస్‌ మోదీగా మారింది. దీంతో బెంగాల్‌లో ఏం జరిగినా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం ఆడపులి మాత్రమే ధైర్యం ప్రదర్శించగలదు. అలాగే మమత కూడా సువేందు అధికారి సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌ బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు ఆమె దెబ్బతిన్న పులి. మరింత దూకుడుగా మారుతారు. అందుకే భాజపా కొంత ఆందోళనగా చెందుతోంది. ఎందుకంటే ధైర్యవంతమైన పులి ముందు నిలబడటానికి ఎవరూ సాహసించరు’’అని శివసేన రాసుకొచ్చింది. 

ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు చేసింది. మమత ఘటనలో సీబీఐ దర్యాప్తును భాజపా డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టింది. తాజా పరిణామాలతో భాజపా ఆందోళన చెందుతోందని, ఎందుకంటే దీదీ గాయం వల్ల నొప్పి భాజపాకేనని అభిప్రాయపడింది. కాషాయ పార్టీ దాదాపు 10 నుంచి 20 సీట్లు కోల్పోయే అవకాశముందని పేర్కొంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని