
తాజా వార్తలు
తొలి రోజు 3లక్షల మందికి టీకా: కేంద్రం
16న ఉదయం 10.30గంటలకు ప్రారంభించనున్న మోదీ
దిల్లీ: కరోనా వైరస్ నిరోధానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 16నుంచి కొవిడ్ టీకా పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30గంటలకు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని కేంద్రం వెల్లడించింది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా అందించనున్నట్టు స్పష్టంచేసింది. తొలి దశలో ప్రభుత్వ/ప్రయివేటు రంగంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కో-విన్ యాప్ ద్వారా టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది? ఇంకా ఎన్ని డోసులు అవసరం.. తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే అధికారులు తెలుసుకోనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తిచేసేందుకు వీలుగా 24×7 పనిచేసే ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని బట్టి ఈ టీకా పంపిణీ కేంద్రాలను 5వేలకు పైగా పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదీ చదవండి..
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
