మంగళగిరిలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
close

తాజా వార్తలు

Published : 22/03/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంగళగిరిలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని నివాసాలను అధికారులు ఈ ఉదయం పొక్లెయిన్‌లతో కూల్చేశారు. బాధితులు అడ్డుకుంటున్నా వారిని పోలీసుల సాయంతో నిలువరించి కట్టడాలను పడగొట్టారు. నిర్మాణాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే అధికారులకు కూల్చివేతలకు ఒడిగట్టారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. 
తాము 40 ఏళ్లుగా ఇదే ప్రాంతంలోనే ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులకు తెలుగుదేశం, వామపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని