మున్నార్‌లో 450 మంది మీద కేసు నమోదు
close

తాజా వార్తలు

Published : 07/05/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మున్నార్‌లో 450 మంది మీద కేసు నమోదు

తిరువనంతపురం: ఇడుక్కిలో కరోనా నిబంధలను ఉల్లంఘించినందుకు 450 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో బహిరంగ కార్యక్రమాలకు 200 మందికి మాత్రమే అనుమతి ఉండగా ఏప్రిల్‌ 13-17 మధ్య మున్నార్‌లోని సీఎస్‌ఐ చర్చి వార్షికోత్సవ వేడుకల్లో వందల మంది హాజరయ్యారు. సీఎస్‌ఐ చర్చి యాజమాన్యం కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో, ఐపీసీ, కేరళ ఎపిడెమిక్‌ డిసీజ్‌ ఆర్డినెన్స్‌ సెక్షన్ల కింద 450 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమావేశం కారణంగా 100 మందికి పైగా కరోనా సోకిందని వాళ్లలో నలుగురు చనిపోయారని వెల్లడించారు. కానీ చర్చి యాజమాన్యం మాత్రం 20 మందికే కరోనా సోకిందని, వాళ్లకు మున్నార్‌ సమావేశానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని