close

తాజా వార్తలు

Published : 15/02/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్టీసీ విలీనం కేసీఆర్‌ వద్దన్నారు: ఏపీ మంత్రి

అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని విలీనం చేయొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పారని మంత్రి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కార్మికులనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని చాలా మంది వ్యతిరేకించారని, చాలా పొరపాటు చేస్తున్నావని జగన్‌కు తెలంగాణ సీఎం  కేసీఆర్‌ చెప్పారని పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వం భరించడం గుదిబండ అని కేసీఆర్‌ అన్నారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని జగన్‌కు సూచించారని తెలిపారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను జగన్‌ సవాలుగా తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని, ప్రభుత్వం, తాను చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని మంత్రి అన్నారు. ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు విశ్వాసం ఉంచాలన్నారు. సీపీఎస్‌ రద్దు, ఆర్టీసీ కార్మికులకు పింఛన్‌ డిమాండ్లను సీఎం నెరవేర్చుతారని నాని భరోసా ఇచ్చారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని