మూడో ఐఫోన్‌ SE ఎలా ఉంటుందంటే?
close

తాజా వార్తలు

Published : 02/03/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో ఐఫోన్‌ SE ఎలా ఉంటుందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్స్‌ ఎన్ని వచ్చినా... SE సిరీస్‌లో వచ్చే మొబైల్స్‌ లెక్క వేరు. చిన్న స్క్రీన్‌తో, చక్కగా ఉండే  ఆ మొబైల్స్‌ కోసం యాపిల్‌ యూజర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే  నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఐఫోన్‌ SE (2020)ని అంతగా ఆదరించారు. ఈ ఊపులో SE (2021)ని తీసుకొస్తారేమో... అందులో ఇంకా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉంటాయేమో అని అభిమానులు ఎదురు చూశారు. అయితే, మూడో ఐఫోన్‌ SE వస్తుంది కానీ... ఈ ఏడాది అయితే కాదట. 2022లో కొత్త ఐఫోన్‌ SEని తీసుకొస్తారని సమాచారం. అంతేకాదు దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కూడా బయటకొచ్చాయి. వచ్చే ఏడాది కాబట్టి 5జీ నెట్‌వర్క్‌తో వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇప్పటివరకు వినిపిస్తున్న పుకార్లు, తెలుస్తున్న సమాచారం ప్రకారం... మూడో ఐఫోన్‌ SE అచ్చంగా తొలితరం SE మొబైల్‌లానే ఉంటుంది. 4.7 అంగుళాల డిస్‌ప్లే ఉండబోతోంది. SE 2020తో పోలిస్తే బెజెల్స్‌ సైజ్‌ కాస్త తగ్గొచ్చు. అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ తీసుకొస్తారు. ఐఫోన్‌ 13లో వాడనున్న A14 బయోనిక్‌ 5జీ చిప్‌సెట్‌నే ఇందులోనూ వినియోగిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఐఫోన్‌ 8 డిజైన్‌నే కొనసాగిస్తారని సమాచారం. అయితే ఐఫోన్‌ 12 మినీ డిజైన్‌ కూడా పరిశీలనలో ఉందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు ఐఫోన్‌ SE ప్లస్‌ కూడా వస్తుందని వార్తలొస్తున్నాయి.  ఐఫోన్‌ SE ప్లస్‌ విషయానికొస్తే ఇందులో 6.1 అంగుళా లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లే ఉండబోతోంది. యాపిల్‌ ట్రేడ్‌ మార్క్‌ పెద్ద నాచ్‌ కొనసాగుతుందట. వెనుకవైపు 18 ఎంపీ కెమెరా ఉంటుంది. యాపిల్‌ కొత్త చిప్‌ సెట్‌ A 14 బయోనిక్‌ 5జీ చిప్‌సెట్‌ను వినియోగిస్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని