బాబ్రీ కేసు తీర్పును స్వాగతిస్తున్నాం: శివసేన
close

తాజా వార్తలు

Published : 30/09/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబ్రీ కేసు తీర్పును స్వాగతిస్తున్నాం: శివసేన

ముంబయి: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పును శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్వాగతించారు. కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని న్యాయస్థానం నిర్దోషులుగా పరిగణించడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు తమ పార్టీ  స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రౌత్‌ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న భాజపా సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి సహా పలువురికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న విషయాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదని అన్నారు. 

కాగా ఈ కేసు నిందితుల్లో శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన సతీశ్‌ ప్రధాన్‌ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడడంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘అసలు మసీదు ధ్వంసం జరిగిన సమయంలో నేను ఆ ప్రదేశంలో లేను. ఆ ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. చివరకు నాకు న్యాయం జరిగింది’అని ప్రధాన్‌ తెలిపారు.  

బాబ్రీ మసీదు ధ్వంసం కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడానికి ఆధారల్లేవని పేర్కొంటూ వారిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని