Bigg Boss telugu 5: నీకు కండబలం లేదా? .. సంపాదించుకో, అడుక్కోకు

తాజా వార్తలు

Updated : 22/10/2021 18:47 IST

Bigg Boss telugu 5: నీకు కండబలం లేదా? .. సంపాదించుకో, అడుక్కోకు

హైదరాబాద్‌: కెప్టెన్సీ టాస్క్‌ వల్ల గత కొన్నిరోజుల నుంచి ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన దూరాలను తొలగించి.. వారిని మరింత దగ్గర చేయడానికి బిగ్‌బాస్‌ సరికొత్త టాస్క్‌తో ముందుకు వచ్చాడు. ఇంటిలో ఉన్న సభ్యులందరూ తమ జీవితాల్లో చోటుచేసుకున్న చేదు అనుభవాలను పంచుకోవాలని సూచించాడు. దీంతో వాళ్లందరూ తమ జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను షేర్‌ చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో భాగంగా సన్నీ మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు అబ్బాయిలను ఓ మహిళ పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు’’ అని తన లైఫ్‌ జర్నీని అందరితో పంచుకున్నాడు. అనంతరం జెస్సీ.. ‘‘పుట్టినప్పటి నుంచి నాకు గొంతులో సమస్య ఉంది. దానివల్ల నాకు సరిగ్గా వాయిస్‌ రాదు. గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకున్నాను. ఫ్యాషన్‌బుల్‌ ఐకాన్‌ అయ్యాను. కానీ మా అమ్మ బయటకు వెళ్లి మా అబ్బాయి మోడల్‌ అని చెప్పుకోలేదు’’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇక, సిరి కథ విని ఇంటి సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మా ఊరిలో వాళ్లు, బంధువులు నన్ను, నా ఫ్యామిలీని సూటిపోటి మాటలతో బాధపెట్టారు. ‘ఇంట్లో పెద్దవాళ్లు ఏమైనా పద్ధతిగా ఉన్నారా? ఈ పిల్ల పద్ధతిగా ఉండటానికి’ అనేవాళ్లు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను. పద్ధతిగానే ఉంటున్నాను’’ అని సిరి చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరూ ఒకింత ఎమోషనల్‌ అయ్యారు. మిగిలిన ఇంటి సభ్యులు పంచుకున్న రియల్‌ లైఫ్‌ స్టోరీలు ఏమిటో తెలియాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని