close

తాజా వార్తలు

Published : 21/04/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల కిడ్నాప్!

గువహటి: అస్సాంలో బుధవారం ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల కిడ్నాప్‌ కలకలం రేపింది. అస్సాం, నాగాలాంగ్‌ సరిహద్దుల్లోని శివసాగర్‌ చమురు క్షేత్రంలో నుంచి వారిని యూఎల్‌ఎఫ్‌ఏ(ఐ) మిలిటెంట్లు అపహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఓఎన్జీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లక్వా క్షేత్రం నుంచి ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల్ని గుర్తుతెలియని సాయుధులు బుధవారం కిడ్నాప్‌ చేశారు. కిడ్నాపైన ముగ్గురిలో జూనియర్‌ టెక్నీషియన్లు ఎంఎం గొగొయి, రితుల్‌ సైకియా మరొకరు జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ అఖిలేష్‌ సైకియా ఉన్నారు. సంస్థకు చెందిన వాహనంలోనే దుండగులు వారిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత వాహనం నిమోనాగఢ్‌ అటవీ ప్రాంతంలో లభ్యమైంది’ అని సంస్థ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇప్పటికే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సంస్థ తెలిపింది. స్థానిక ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించినట్లు వెల్లడించింది.

జిల్లా పాలనా విభాగం సీనియర్ ‌అధికారి మాట్లాడుతూ.. ఈ కిడ్నాప్‌ వెనక యూఎల్ఎఫ్‌ఏ(ఐ) మిలిటెంట్ల హస్తం ఉండి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని