ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌
close

తాజా వార్తలు

Published : 17/04/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌

తిరుపతి: చెదురుమదురు ఘటనలతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తిరుపతి లోక్‌సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదయింది. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి నియోజకవర్గంలో 45.84 శాతం, సర్వేపల్లి నియోజకవ్గంలో 57.91 శాతం, గూడూరు నియోజకవ్గంలో 51.82 శాతం, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 60.11శాతం, వెంకటగిరి నియోజకవర్గంలో 55.88 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 57 శాతం, సత్యవేడు నియోజకవర్గంలో 58.4 శాతం పోలింగ్‌ నమోదైంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని