
తాజా వార్తలు
దుర్వాసనలు దూరం చేద్దామిలా!
మాంసం, గుడ్డు, చేపలు... వంటివి వండినప్పుడు ఆ పాత్రల నుంచి ఒకరకమైన నీచు వాసన వస్తుంది. మరి ఈ దుర్వాసనను దూరం చేయాలంటే... వంటింట్లోని పదార్థాలే చాలు. అవేంటో చూద్దామా!
కాఫీతో...
చెంచా కాఫీ పొడిని దుర్వాసన వస్తున్న పాత్రలో వేసి కాసిని నీళ్లు పోసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాలపాటు అలా వదిలేయాలి. కాఫీ నీళ్లు పారబోసి డిష్ వాషింగ్ డిటర్జెంట్‌తో శుభ్రం చేస్తే వాసన పూర్తిగా పోతుంది.
బంగాళాదుంపతో...
దుంపను మందమైన ముక్కలుగా కోసి, రెండు వైపులా ఉప్పు అద్దాలి. ఈ ముక్కలను పది నిమిషాల పాటు వాసన వస్తున్న పాత్రలో వేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
దాల్చిన చెక్కతో...
దుర్వాసన వచ్చే పాత్రలో నాలుగైదు కప్పుల నీళ్లు పోసి, అందులో చెంచా దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్క వేసి అయిదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. దీన్ని చల్లార్చిన తర్వాత చూస్తే దుర్వాసన ఉండదు.