ఇష్టపడిన యువతి మాట్లాడలేదని..
close

తాజా వార్తలు

Published : 26/01/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్టపడిన యువతి మాట్లాడలేదని..

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇష్టపడిన యువతి కొన్నాళ్లగా మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సీపట్నం వెంకునాయుడుపేటకు చెందిన డ్రైవర్‌ తుమ్మల రమేష్‌ (24) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామీణ ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. అవివాహితుడైన రమేష్‌కి గబ్బాడ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఆమె తనతో మాట్లాడక పోవడంతో వేదనకు గురయ్యాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఈనెల 21న చరవాణిలో మెసేజ్‌ పెట్టాడు. ఆందోళన చెందిన స్నేహితులు వెళ్లి చూసే సరికి బాగానే ఉన్నాడు. ఇదే మాదిరిగా మరో రెండుసార్లు మెసేజ్‌లు పెట్టాడు. అతడి నుంచి ఇలాంటి మెసేజ్‌లు సాధారణమేనని స్నేహితులు పట్టించుకోలేదు. శనివారం ధర్మసాగరం సమీపంలోనిజ్ఞని జీడితోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు. 

ఇవీ చదవండి..
మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు 

ఉగ్రవాదుల చేతుల్లో కొత్త మెసేజింగ్‌ యాప్‌లు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని