Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176495
            [news_title_telugu_html] => 

చౌక వడ్డీ రేటుకే ఎస్‌బీఐ వాహన, గృహ రుణాలు

[news_title_telugu] => చౌక వడ్డీ రేటుకే ఎస్‌బీఐ వాహన, గృహ రుణాలు [news_title_english] => [news_short_description] => పండుగ సీజన్‌లో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)  ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు వర్తిస్తాయో వెల్లడించలేదు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/Ev-A4V4u7to [news_videoinfo] => |https://www.youtube.com/embed/Ev-A4V4u7to [news_sections] => ,27,26, ) )
చౌక వడ్డీ రేటుకే ఎస్‌బీఐ వాహన, గృహ రుణాలు - EENADU
close
చౌక వడ్డీ రేటుకే ఎస్‌బీఐ వాహన, గృహ రుణాలు

దిల్లీ: పండుగ సీజన్‌లో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)  ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు వర్తిస్తాయో వెల్లడించలేదు.
* కారు రుణాలకు ప్రాసెసింగ్‌ రుసుము ఉండదు. వడ్డీ రేటు అత్యంత తక్కువగా 8.7% నుంచి ప్రారంభమవుతుంది. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరిగినా ఆ భారం వినియోగదారులపై వేయబోమని తెలిపింది.
* ఆన్‌లైన్‌ ద్వారా అంటే ఎస్‌బీఐ డిజిటల్‌ ప్లాట్‌ఫాం యోనో లేదా ఎస్‌బీఐ పోర్టల్‌ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటులో 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు పొందొచ్చు.
* వేతనజీవులు కారు ఆన్‌రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు.
* రెపోరేటు ఆధారిత గృహరుణాలను 8.05 శాతానికే ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారికి, కొత్తగా రుణాలు తీసుకునేవారికి సెప్టెంబరు 1 నుంచి ఈ వడ్డీ రేటు వర్తించనుంది.
* రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాలకు 10.75 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభం అవుతుంది. ఆరేళ్ల వరకు కాలావధి ఉంటుంది. యోనో యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా వేతనజీవులకు రూ.5 లక్షల వరకు ముందస్తు రుణ అనుమతిని (ప్రీఅప్రూవ్డ్‌ లోన్స్‌) కూడా ఎస్‌బీఐ ఇస్తోంది.
* భారత్‌లో చదివేందుకు రూ.50 లక్షల వరకు, విదేశాల్లో చదివేందుకు రూ.1.50 కోట్ల వరకు విద్యారుణాలకు వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. 15 ఏళ్ల వరకు కాలపరిమితి ఎంపిక చేసుకోవచ్చు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.