Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179624
            [news_title_telugu_html] => 

క్షయకూ రాజధానే

[news_title_telugu] => క్షయకూ రాజధానే [news_title_english] => [news_short_description] => రాష్ట్రంలో క్షయ, కుష్ఠు వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. గత ఏడాది కొత్తగా 52 వేల మంది క్షయ బాధితులు, 3 వేల మంది కుష్ఠు బాధితులు నమోదయ్యారు. అంటువ్యాధుల గుర్తింపు లక్ష్యంలో.. ఏటా 60-70 శాతాన్ని మించడం లేదు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
క్షయకూ రాజధానే - EENADU
close
క్షయకూ రాజధానే

హైదరాబాద్‌లో అత్యధికంగా బాధితులు
రాష్ట్రంలో గత ఏడాది 52 వేల కేసుల నమోదు
నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో ప్రబలుతున్న కుష్ఠు
ఏటా 3 వేల కేసుల గుర్తింపు
నేటి నుంచి వచ్చే నెల 12 వరకూ ప్రత్యేక కార్యక్రమం
ఈ రెండు వ్యాధులపై ఇంటింటా తనిఖీ

రాష్ట్రంలో క్షయ, కుష్ఠు వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. గత ఏడాది కొత్తగా 52 వేల మంది క్షయ బాధితులు, 3 వేల మంది కుష్ఠు బాధితులు నమోదయ్యారు. అంటువ్యాధుల గుర్తింపు లక్ష్యంలో.. ఏటా 60-70 శాతాన్ని మించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యాధుల నిర్మూలనే లక్ష్యంగా.. బాధితులను వంద శాతం గుర్తించేందుకు నేటి నుంచి వచ్చే నెల 12 వరకూ ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షించే విధానం అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఏటా 2,500-3,000 వరకూ కుష్ఠు కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో 15 ఏళ్లలోపు పిల్లలు 6.33 శాతం మంది వరకూ ఉన్నారు. వ్యాధి లక్షణాలతో ఉంటూ గుర్తింపునకు నోచుకోకుండా ఉన్నవారు ఏటేటా పెరుగుతున్నారని వైద్యశాఖ గుర్తించింది.

* 2018లో 77,352 కొత్త క్షయ కేసులను గుర్తించడం లక్ష్యం కాగా.. 52,191 (67 శాతం) కేసులను  ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ నిర్దేశించిన లక్ష్యంలో 28,154 (97 శాతం) కొత్త క్షయ కేసులను నిర్ధారించింది. గతేడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మే చివరి నాటికి రాష్ట్రం మొత్తమ్మీద 25 శాతం అదనంగా కొత్త కేసులను గుర్తించగలిగారు.

రెండు వారాల ప్రణాళిక ఇదీ
ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త (ఆశా), ఓ స్వచ్ఛంద సేవకుడు (పురుషుడు)తో కూడిన ఇద్దరు సభ్యుల బృందం రోజూ 20 ఇళ్లకు వెళ్లి నిర్దేశించిన ప్రశ్నలు అడుగుతారు. వారి సమాచారాన్ని ఏఎన్‌ఎంలకు అందజేస్తారు. ఎవరిలోనైనా వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. ఏఎన్‌ఎం మరోసారి పరీక్షించి అనుమానితులను సమీపంలోని వైద్యాధికారి వద్దకు తీసుకెళ్తారు. పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధరణ అయితే.. చికిత్స ప్రారంభిస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.