జగన్‌ కేసుల్లోని అధికారులకు ఉన్నత పదవులా?
close

ప్రధానాంశాలు

జగన్‌ కేసుల్లోని అధికారులకు ఉన్నత పదవులా?

ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ చేశారు
శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి పోస్టింగు ఇచ్చారు
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి  జగన్‌ తన కేసుల్లో ఉన్న అధికారులందరికీ ఉన్నత పదవులు కట్టబెట్టారని, వారంతా ఆయన దుశ్చర్యలకు వంత పాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. నిజాయతీగా పని చేసే అధికారులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలకు.. ముఖ్యమంత్రికి సంబంధమేంటి? స్వయంప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి సీఎం ఎవరు? ముఖ్యమంత్రి తన వాళ్లతో స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడమేంటి?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి తన చెప్పుచేతల్లో ఉన్న అధికారులకే ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు. ఆయన కేసుల్లో నిందితులుగా ఉన్న అధికారులను రాష్ట్రాలు దాటించి మరీ ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారు. శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌ నుంచి తెచ్చుకుని పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన కేసుల్లో ఉన్న మరో అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశారు’ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు శనివారం పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగన్‌ది అపరిచితుడు సినిమా తరహాలో ‘స్ప్లిట్‌ పర్సనాలిటీ’ అని, ఆయన చెప్పింది చేయరని, చేసేది చెప్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని