close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
8 నుంచి జాగ్రత్త సుమా

తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు, మాల్స్‌
కేంద్రం తాజా మార్గదర్శకాలు
కట్టడి ప్రాంతాల్లో ఉంటే ఆంక్షలే
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: లాక్‌డౌన్‌ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తున్నా తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఒకవేళ ఇవి కట్టడి ప్రాంతాల్లో (కంటెయిన్‌మెంట్‌ జోన్లలో) ఉంటే మూసే ఉంచాలని ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు, ప్రార్థన స్థలాలను ఆ రోజు నుంచి తెరిచే వీలు కల్పిస్తున్న నేపథ్యంలో 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుగుణంగా జీవో 75ను జారీ చేసింది.
* ప్రవేశ మార్గంలో తప్పనిసరిగా శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థ ఉండాలి. వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
* లిఫ్టుల్లో ఒకేసారి ఎక్కువ మంది వెళ్లకూడదు.
* అతిథుల ప్రయాణ చరిత్ర వివరాలు, ఆరోగ్య పరిస్థితితో పాటు గుర్తింపు పత్రం, స్వీయ ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
* రెస్టారెంట్లలో భౌతిక దూరానికి అనువుగా సీట్లు ఏర్పాటు చేయాలి.
* ఏసీ 24-30 డిగ్రీల మధ్యలో ఉండాలి.
* మాల్స్‌లో పిల్లలు ఆడుకొనే స్థలాలు, సినిమా హాళ్లు మూసేయాలి.
* రెస్టారెంట్లలో తినే బదులు ఆహార పదార్థాలను వినియోగదారులు ఇళ్లకు తీసుకెళ్లేలా ప్రోత్సహించాలి. సామర్థ్యంలో 50 శాతానికి మించి వినియోగదారుల్ని అనుమతించకూడదు.


ప్రార్థన మందిరాల్లో ఇలా..

ప్రార్థన మందిరాలకు సందర్శకులను దశలవారీగా వదలాలి. భక్తి గీతాలను బృందాలుగా ఆలపించకుండా రికార్డు చేసినవి వినిపించాలి. ప్రార్థనలకు తివాచీలను భక్తులు తమ వెంట సొంతంగా తెచ్చుకునేలా చూడాలి.
* ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం జల్లడం వంటివి చేయకూడదు. అన్నప్రసాద తయారీలో, వితరణలో తప్పకుండా భౌతికదూరం పాటించాలి.
* విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి.
* భక్తులు పాదరక్షలను తమ సొంత వాహనాల్లోనే వదిలి రావడం మేలు. లేదంటే వాటిని ప్రత్యేకంగా ఉంచుకోవాలి.


ఇంటి నుంచి పనిని సెలవుగా పరిగణించరాదు

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులు కార్యాలయాలకు రాకూడదు. అలాంటి ఉద్యోగులందర్నీ ఇళ్లనుంచే పనిచేసేందుకు అనుమతించాలి. దాన్ని సెలవుల కింద ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదు.
* కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలి.
* వాహనాలను 1% సోడియం హైపోక్లోరైట్‌తో నిత్యం శుభ్రం చేయాలి.
* పనివేళలు, విరామాలను దశలవారీగా అమలుచేయాలి.
* కార్యాలయాల్లో 1-2 పాజిటివ్‌ కేసులు బయటపడితే వారు గత 48 గంటల్లో తిరిగిన ప్రాంతం వరకే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేపట్టాలి. మొత్తం భవనాన్ని మూసేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ కేసులు వస్తే మొత్తం భవనాన్ని/ బ్లాకును 48 గంటలపాటు మూసేసి సంపూర్ణంగా శుభ్రం చేయాలి. ఆ పని పూర్తయ్యేంతవరకూ సిబ్బంది ఇంటినుంచే పనిచేయాలి.
* ప్రతి ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థ ఉండాలి. లక్ష్మణాలు కనిపించనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.
*  వినియోగదారులు భౌతికదూరం పాటించేలా చూడటానికి ఈ వ్యవస్థల యాజమానులు తగిన సిబ్బందిని నియమించాలి.
* ఉద్యోగుల్లో వృద్ధులు, గర్భిణీస్త్రీలు, అనారోగ్యసమస్యలున్నవారు ఉంటే వారిని ప్రజలతో నేరుగా సంబంధం ఉండేచోట ఉంచకూడదు.  వీలైనచోట్ల అంతా ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా చూడాలి.


* పార్కింగ్‌ల్లోనూ భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* వచ్చి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉంచాలి.  ప్రతి క్యూలోనూ మనుషుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా చూడాలి.
* రిసెప్షన్‌లో తప్పనిసరిగా శానిటైజర్‌ ఉంచాలి. అతిథులు ఫామ్‌ భర్తీచేసేముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకొనేలా చూడాలి.
* నగదు లావాదేవీలు తగ్గించి ఆన్‌లైన్‌ లావాదేవీలు పెంచాలి. ప్రతి లగేజీని లోపలికి తెచ్చేముందే డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి.
* అతిథుల్లో వయోవృద్ధులు, గర్భిణీలు, వైద్యఆరోగ్యసమస్యలున్నవారు ఉంటే అదనపు జాగ్రత్తలు తీసుకోమని సూచించాలి.
* బట్ట న్యాప్‌కిన్లకు బదులు మంచి నాణ్యమైన పేపర్‌ న్యాప్‌కిన్లను వాడాలి.
* హోటల్‌ సిబ్బంది, వినియోగదారులు పరస్పరం తారసడే అవకాశం లేకుండా  డిజిటల్‌ ఆర్డర్‌, పేమెంట్లను ప్రోత్సహించాలి.
* వాష్‌రూమ్‌లను తరచూ బాగా శుభ్రం చేయాలి.
* ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే వారిని వేరుగా ఉంచాలి. డాక్టర్‌ వచ్చి పరీక్షించేంతవరకూ వారు మాస్క్‌, ఫేస్‌కవర్‌ వేసుకొని ఉండేలా చూడాలి.
* కస్టమర్లు లేచి వెళ్లిపోయిన వెంటనే టేబుళ్లు శానిటైజ్‌ చేయాలి. వంటగదుల్లోనూ సిబ్బంది భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* భౌతికదూరం పాటించేందుకు వీలుగా మాల్స్‌లోపల వినియోగదారులు తక్కువ సంఖ్యలో ఉండేలా చూడాలి.
* లిఫ్టులు, ఎస్కలేటర్లకు బదులు మెట్లు ఎక్కివెళ్లేలా ప్రోత్సహించాలి.
* రెస్టారెంట్లలో ఆహారపదార్థాలను ఇంటికి తీసుకెళ్లేలా ప్రోత్సహించాలి. ఇలా సరఫరా చేసే ఇబ్బంది ప్యాకెట్లను వారి ఇంటిముంగిట వదిలిపెట్టాలి తప్పితే నేరుగా చేతికి అందించకూడదు.
* ఇలా సరఫరా చేసే సిబ్బందిని యజమానులు నిరంతరం థర్మల్‌స్క్రీన్‌ చేయాలి.
* అన్నిచోట్లా డిస్పోజబుల్‌ మెనూలు ఏర్పాటుచేయాలి. రెస్టారెంట్లలోకి 50 %కి మించి జనాలను అనుమతించకూడదు.
* స్టాఫ్‌, వెయిటర్లు తప్పనిసరిగా మాస్కులు, చేతులకు తొడుగులు ధరించేలా చూడాలి.
* ప్రార్థనామందిరాలకు సందర్శకులను దశలవారీగా వదలాలి.
* ప్రార్థనామందిరాల వెలుపల ఉన్న దుకాణాలు, ఇతరత్రా అన్నిచోట్లా భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎక్కడా ఎక్కుమంది గుమికూడకుండా ఆంక్షలు విధించాలి. ప్రార్థనామందిరాల్లో నేలను తరచూ శుభ్రం చేయాలి.
* అందరూ ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించాలని ప్రోత్సహించాలి.

* కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులు దాన్ని డీనోటిఫై చేసేవరకు ఆఫీసులకు రావొద్దు. అలాంటి ఉద్యోగులందర్నీ ఇళ్లనుంచే పనిచేసేందుకు అనుమతించాలి. దాన్ని సెలవుల కింద పరిగణించకూడదు.

* అధికారుల వాహనాలు నడిపే డ్రైవర్లుకూడా భౌతికదూరం పాటించాలి. కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలి.
* వాహనాలను 1% సోడియం హైపోక్లోరైట్‌తో నిత్యం శుభ్రం చేయాలి. స్టీరింగ్‌, డోర్లు, హ్యాండిల్స్‌, తాళాలుకూడా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి.
* సందర్శకులను తగ్గించాలి. సమావేశాలు వీలైనంతమేర వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారానే కొనసాగించాలి.
* ఆఫీసు పనివేళలు, మధ్యాహ్న భోజనం, టీవిరామాలు దశలవారీగా అమలుచేయాలి.
* హైరిస్క్‌ కాంటాక్ట్స్‌ 14 రోజులు క్వారెంటైన్‌కు వెళ్లాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.