close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజానేత.. కన్నుమూత

  నిరాడంబరతే రాజయ్య ప్రత్యేకత

భద్రాచలం, న్యూస్‌టుడే: నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ పోరాడే వ్యక్తి మాయదారి కరోనాకు బలయ్యారని తెలిసి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సున్నం రాజయ్య(62) కొవిడ్‌తో మృతిచెందడంతో నియోజకవర్గంలో విషాదం నెలకొంది.
రాజయ్యది తొలి నుంచి నిరాడంబర జీవనశైలి. స్వస్థలంలో సొంతంగానే వ్యవసాయపనులు చేసుకోవడం, నియోజకవర్గంలో ద్విచక్రవాహనంపైనే తిరుగుతూ ప్రజాసమస్యలు తెలుసుకునేవారు. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామం సున్నంవారిగూడెంలో నివసిస్తున్న రాజయ్యకు కరోనా సోకగా మెరుగైన వైద్యం కోసం సోమవారం విజయవాడ తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశారు. భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం సున్నంవారిగూడేనికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నిక
భద్రాచలం నియోజకవర్గం నుంచి రాజయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004లలో వరుసగా గెలిచారు. 2009లో ఓటమి చెందినా, 2014లో మూడోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ పడి ఓడిపోయారు. రాజయ్య హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులోనే వచ్చేవారు. నగరంలో ఆటోలోనే ప్రయాణించేవారు. అసెంబ్లీలో ఒకసారి తన మాతృభాష కోయ భాషలో మాట్లాడి సభను ఆకట్టుకున్నారు.
ముఖ్యమంత్రి సంతాపం
ఈనాడు, హైదరాబాద్‌: సున్నం రాజయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన రాజయ్య.. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.