close

తాజా వార్తలు

జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం ‘బాహుబలి’

హైదరాబాద్‌: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ద్వారా ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను తీసినట్లు ఇప్పటికే వర్మ చెప్పారు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించారు. ఎన్టీఆర్‌ పాత్రను రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ పోషించారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో విడుదలైంది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్రం విడుదలను నిలిపివేశారు. ఇప్పుడు మే 31న సినిమా అక్కడ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమానా?
వర్మ: ఎన్టీఆర్‌ గారి వెనుక జరిగిన కుట్రల్ని ఈ సినిమాలో బయటపెట్టాం అంతే.. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ఇది కాదు.

మీరు వివాదాస్పద సినిమాలే తీయడానికి కారణం ఏంటి?
వర్మ: నాకు ఇష్టం. రౌడీయిజాన్ని నేను ప్రారంభించలేదు. ఇప్పటికే జరిగిన దాన్ని సినిమాల్లో చూపిస్తున్నా. నాకు గిల్లడం అంటే ఇష్టం.

ఎన్నికలకు ముందు ఇలాంటి సినిమాను విడుదల చేస్తే అడ్డుకుంటారని మీకు తెలియదా?
వర్మ: అలా ఎలా అనుకుంటాం. మరి హైదరాబాద్‌ కోర్టు ఎందుకు కేసు కొట్టేసింది. అక్కడ ఎందుకు సినిమా విడుదలైంది.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు?
వర్మ: 70 ఏళ్లు ఓ మహారాజు, చక్రవర్తిలా బతికిన ఎన్టీఆర్‌.. చివరి రోజుల్లో నరకయాతన అనుభవించి మరణించారు. ఆయన వెనుక ఉండి, నాటకం ఆడిన ఓ వ్యక్తి కథ ప్రజలకు తెలియాలని నాకు అనిపించింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన (ఎన్టీఆర్‌) పేరు, ఫొటో పెట్టుకుని మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. దీనికి మించిన ద్రోహం ఏమీ లేదని నా ఉద్దేశం.

ఈ సినిమా విడుదలను అభ్యంతరాలు వచ్చాయి కదా?
వర్మ: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో నిజాలు చెప్పేందుకు ప్రయత్నించా. అది కొంత మందికి నచ్చలేదు. అందుకే విడుదలకు అడ్డంకులు సృష్టించారు.

జనసేన ఓటమిపై మీ అభిప్రాయం?
వర్మ: ఓ నటుడుగా చిరంజీవి గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం. పవన్‌ అంటే కూడా అభిమానం ఉంది. చిరంజీవి గారికి ఆ సమయంలో 18 సీట్లు వచ్చాయి. జనసేనకు 1 సీటు వచ్చింది. జనసేనతో పోల్చితే ప్రజారాజ్యం ‘బాహుబలి’. ఎందుకంటే 18 రెట్లు విజయం సాధించింది కాబట్టి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.