Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114735
            [news_title_telugu_html] => 

భాజపాలో చేరిన నలుగురు తెదేపా ఎంపీలు

[news_title_telugu] => భాజపాలో చేరిన నలుగురు తెదేపా ఎంపీలు [news_title_english] => sujana tg cm ramesh joins BJP [news_short_description] => తెదేపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌ భాజపాలో చేరారు. ఈ మేరకు దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఈ ముగ్గురికీ పార్టీ కండువా వేసి పుష్పగుచ్ఛంతో కమల దళంలోకి సాదరంగా ఆహ్వానించారు.  [news_tags_keywords] => Sujanachowdary, TG venkatesh, BJP,  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/oF0DKreHbjY [news_videoinfo] => |https://www.youtube.com/embed/oF0DKreHbjY [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-21 01:31:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపాలో చేరిన నలుగురు తెదేపా ఎంపీలు - sujana tg cm ramesh joins BJP - EENADU
close

తాజా వార్తలు

భాజపాలో చేరిన నలుగురు తెదేపా ఎంపీలు

దిల్లీ: తెదేపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు భాజపాలో చేరారు. ఈ మేరకు దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా వారికి పార్టీ కండువా వేసి పుష్పగుచ్ఛంతో కమల దళంలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వం నచ్చి తెదేపా నేతలు భాజపాలో చేరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే వీరు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. భాజపా సానుకూల రాజకీయాలతో ముందుకెళ్తోందని, తెదేపా నేతల చేరికతో ఏపీలో భాజపా బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

జాతి నిర్మాణంలో భాగస్వామి అవుతాం: సుజనా

ఇటీవల ఎన్నికల్లో జాతి అంతా భాజపా వైపే ఉందని తేలిందని.. అప్పుడే తామంతా భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నామని ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో తాను పనిచేసినట్టు గుర్తుచేశారు. సంఘర్షణ కంటే సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలమని నమ్ముతున్నామన్నారు. విభజన చట్టం పకడ్బందీగా అమలుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. జాతి నిర్మాణంలో భాగస్వాములం అవుతామన్నారు.  

మళ్లీ మాతృసంస్థకు వస్తున్నా..

దేశ ప్రజలందరూ భాజపా ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తామూ ప్రజల వెంటే వెళ్తున్నామని ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. వైకాపా ప్రభుత్వం కూడా భాజపాతో సఖ్యతగా ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన తాను మళ్లీ మాతృసంస్థకే వస్తున్నానని టీజీ వ్యాఖ్యానించారు. 

ఈ రోజు ఉదయం రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ కీలక తీర్మానం చేసింది. రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీని తక్షణమే భాజపాలో విలీనం చేయాలని తెదేపా ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడును కోరారు. 10వ షెడ్యూల్‌లోని 4వ పేరా నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని ఉపరాష్ట్రపతిని కోరిన నేతలు.. కాసేపటికే భాజపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర  మోదీ నేతృత్వంలోని దేశాభివృద్ధి, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నామని ఎంపీలు పేర్కొన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.