close

తాజా వార్తలు

‘హౌదీ మోదీ’లో ట్రంప్‌ కీలక ప్రకటన!

మొదటిసారి ఒకే వేదికపై ఇద్దరు అగ్రనేతలు

వాషింగ్టన్‌ డీసీ: వచ్చే ఆదివారం సెప్టెంబరు 22న హ్యూస్టన్‌లో జరిగే ‘హౌదీ మోదీ!’ మెగా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యూస్టన్‌ కార్యక్రమంలో మోదీతో కలిసి ట్రంప్‌ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని శ్వేత సౌధం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య బంధాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. 
హ్యూస్టన్‌ కార్యక్రమంలో కీలక ప్రకటన గురించి బుధవారం ట్రంప్‌ను విలేకరులు కూడా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ట్రంప్‌.. మోదీకి తనకు మధ్య స్నేహ బంధం ఉందని మాత్రమే చెప్పి వెళ్లిపోయారు. ప్రకటన గురించి స్పష్టంగా చెప్పకపోయినా పరోక్షంగా మాట్లాడి వెళ్లిపోయారు. కానీ మీడియా కథనాలు, నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో కీలక ఒప్పందాన్ని ఖరారు చేసుకొనే అవకాశముందని తెలుస్తోంది. 
గత జూన్‌లో 28 రకాల అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. వాణిజ్యంలో ప్రధానమైన వాణిజ్య ప్రాధాన్యతలను అమెరికా విరమించుకున్నందుకు ప్రతిగా భారత్‌ సుంకాన్ని పెంచింది.
సెప్టెంబరు 22న మొదటిసారి మోదీ-ట్రంప్‌ ఒకే వేదిక పంచుకోబోతున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు దాదాపు 50 వేల మంది భారతీయ అమెరికన్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ట్రంప్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించాక ఈ సంఖ్య మరింత పెరిగింది. సెప్టెంబరు 21-27 మధ్య మోదీ అమెరికా పర్యటన ఉండనుంది. ఈ పర్యటనలోనే ఐరాస సర్వసభ్య వార్షిక సమావేశం కూడా జరగనుంది. దీని అనంతరం మోదీ-ట్రంప్ మరోసారి సమావేశం అవుతారు.
గత మూడు నెలల కాలంలో ఇద్దరు అగ్ర నేతలు రెండు సార్లు సమావేశమయ్యారు. హ్యూస్టన్‌ కార్యక్రమం మూడో భేటీ అవుతుంది. జపాన్‌లోని జీ-20 సదస్సు, ఫ్రాన్స్‌లోని జీ-7 సదస్సులో ఇరువురు నేతలు సమావేశమయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.