close

తాజా వార్తలు

జియో గిగా ఫైబర్ ఛార్జీలు ఎంతంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: జియో గిగా ఫైబర్‌ పేరుతో రిలయన్స్‌ నుంచి బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేవలం 1,100 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినా ఇవి ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా గిగా ఫైబర్‌ ఇంకా ప్రారంభం కాలేదు. ట్రయల్‌ పద్ధతిలో ప్రస్తుతం వినియోగదారులు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. వాణిజ్యపరంగా బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయి? తర్వాత నెలవారీ ఛార్జీలు ఎంత ఉంటాయనే దానిపై వినియోగదారుల్లో స్పష్టత లేదు. అయితే ఈ సేవలు ఆగస్టు 12న వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశమున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

నెలవారీ ఛార్జీలు ఎంతంటే..
జియో గిగా ఫైబర్‌ ద్వారా పరిమితి లేని వాయిస్‌ కాల్స్‌తోపాటు, 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, జియో హోం టీవీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్‌కు ఉచిత చందా వంటి సౌకర్యాలున్నాయి.
ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. జియో ఫైబర్‌ నుంచి మూడు వేర్వేరు ప్లాన్లు ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంటర్నెట్‌, టీవీ, ఐఓటీ సేవల్లో ఏదో ఒకటి ఎంచుకొనే సదుపాయం లేదా మూడూ ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉండనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ను ప్రవేశపెట్టనుండగా.. నెలవారీ ఛార్జీ రూ.500 నుంచి రూ.వెయ్యి మధ్య ఉండే అవకాశముంది. అధికారికంగా టారీఫ్‌ ఛార్జీలు సంస్థ వెల్లడించాల్సి ఉంది.
ప్రస్తుతం ట్రయల్‌ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో సెక్యురిటీ డిపాజిట్‌ రూ.2,500 నుంచి రూ.4,500 వసూలు చేసి గిగా ఫైబర్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు. ఇందులో భాగంగా రూటర్‌ వంటి పరికరాలు అమర్చుతారు. కనెక్షన్‌ వద్దనుకున్న పక్షంలో సెక్యురిటీ డిపాజిట్‌ వెనక్కి ఇచ్చేస్తామని కంపెనీ వర్గాలు చెబుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.