close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంచీపురం: తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారు ఆలయంలోని అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపుడైన అత్తివరదరాజ స్వామి విగ్రహం జలం వీడి జనంలోకి వచ్చే మనోహర దృశ్యం 40ఏళ్లకు ఓసారి జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజస్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి ఈ ఏడాది జులై 1న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 31 రోజుల పాటు శయన అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు ఆగస్టు 1 నుంచి నిలబడిన అవతారంలో దర్శనమిచ్చారు. 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామి భక్తులకు మళ్లీ 2059లో దర్శనమివ్వనున్నారు.   

ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు కంచికి క్యూ కట్టారు. ఈ మనోహర దృశ్యాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలన్న సంకల్పంతో పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అత్తివరదరాజస్వామిన దర్శించుకొని తరించారు. ఇప్పటివరకు దాదాపు కోటిమందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్టు సమాచారం. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.