Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145669
            [news_title_telugu_html] => 

ఆ కారును ఐదు సార్లు ఢీకొట్టాల్సిన పనేంటి!

[news_title_telugu] => ఆ కారును ఐదు సార్లు ఢీకొట్టాల్సిన పనేంటి! [news_title_english] => On CCTV SUV Hits Parked Car 5 Times Before Driving Away In Pune [news_short_description] => ఒక ఆగి ఉన్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టిందంటే అందరూ ఏమనుకుంటారు. అయ్యో అదుపుతప్పి ఢీకొందేమో అనుకుంటారు. కానీ అదే కారు మళ్లీ వెనక్కి వచ్చి రెండో సారి కూడా ఢీకొంటే ఇప్పుడు ఏమనుకుంటారు. ఇదేదో కావాలని పగతో చేసిన పని, లేదా ఏదైనా సినిమా షూటింగ్‌ అయినా తీస్తున్నారేమో అనుకుంటారు కదా. [news_tags_keywords] => duster car,accident,pune,cctv record [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164137736913207296 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:33:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ కారును ఐదు సార్లు ఢీకొట్టాల్సిన పనేంటి! - On CCTV SUV Hits Parked Car 5 Times Before Driving Away In Pune - EENADU
close

తాజా వార్తలు

ఆ కారును ఐదు సార్లు ఢీకొట్టాల్సిన పనేంటి!

పుణె: ఒక ఆగి ఉన్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టిందంటే అందరూ ఏమనుకుంటారు. అయ్యో అదుపుతప్పి ఢీకొందేమో అనుకుంటారు. కానీ అదే కారు మళ్లీ వెనక్కి వచ్చి రెండో సారి కూడా ఢీకొంటే ఇప్పుడు ఏమనుకుంటారు. ఇదేదో కావాలని పగతో చేసిన పని, లేదా ఏదైనా సినిమా షూటింగ్‌ అయినా తీస్తున్నారేమో అనుకుంటారు కదా. ఉద్దేశమేదైనా కావచ్చు కానీ మహారాష్ట్రలోని పుణెలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక కారు మరో కారును ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడే ఎదురుగా రోడ్డు అవతలి వైపు నిల్చున్న వ్యక్తులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుణెలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి డస్టర్‌ కారులో వచ్చి అక్కడ పార్కింగ్‌లో ఉన్న ఇండికా కారును ఢీకొట్టి వెళ్లారని తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.