ఆంధ్రప్రదేశ్‌లో 22,018
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంధ్రప్రదేశ్‌లో 22,018

తూర్పుగోదావరిలో 3,432 మందికి పాజిటివ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజులుగా పాజిటివిటీ రేటులో పెద్దగా మార్పు కనిపించడం లేదు. గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య  89,087 నమూనాలు పరీక్షించగా 22,018 (24.71%) మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,38,803కి చేరింది. తాజాగా 19,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03,787 క్రియాశీలక కేసులు ఉన్నాయి. తాజాగా వచ్చిన 22,018 కేసుల్లో  10,553 కేసులు (47%) తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, విశాఖ  జిల్లాల్లోనే నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,432  (15.58%) కేసులు నమోదవడం అక్కడ పరిస్థితి తీవ్రతను  తెలియజేస్తోంది. తాజాగా మరో 96 మంది వైరస్‌కు బలయ్యారు. వీరితో మొత్తం మృతుల సంఖ్య 9,173కి పెరిగింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు