మున్సిపల్‌ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మున్సిపల్‌ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం

కాంట్రాక్టు, క్యాజువల్‌ లేబర్‌కు వర్తింపు
కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. పురపాలక సంఘాలతో పాటు నగరపాలక సంస్థల్లోని తాత్కాలిక, ఒప్పంద కార్మికులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఈఎస్‌ఐ చట్టం కింద నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ను గాంగ్వర్‌ ఆదేశించారు. ఈఎస్‌ఐ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫైడ్‌ ఏరియాలుగా ప్రకటించిన ప్రాంతాల్లోని క్యాజువల్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, ఏజెన్సీలు, ఎస్టాబ్లిష్‌మెంట్లకీ దీన్ని విస్తరింపజేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ సంస్థలు ఏటా పెద్దఎత్తున కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికుల సేవలను ఉపయోగించుకుంటున్నాయి. వీరెవరూ శాశ్వత ఉద్యోగులు కాదు. దీనివల్ల వారికి సామాజిక భద్రత కరవవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అందరికీ ఈఎస్‌ఐ ప్రయోజనం కల్పించాలని నిర్ణయించినట్లు గాంగ్వర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నోటిఫికేషన్‌ జారీచేసిన వెంటనే కార్మికులందరికీ పూర్తిస్థాయిలో ఈఎస్‌ఐ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు