క్రియాశీలక కేసులు పైపైకి..

ప్రధానాంశాలు

క్రియాశీలక కేసులు పైపైకి..

  4 రోజులుగా పెరుగుదల

  24 గంటల్లో 41,649 మందికి వైరస్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య శనివారం కొంత తగ్గినప్పటికీ.. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 4 రోజులుగా క్రియాశీలక కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో 41,649 కొత్త కేసులు బయటపడగా.. 593 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఒక రోజులో 37,291 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. వరుసగా నాలుగో రోజు కోలుకున్నవారి కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువ నమోదైంది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 4,08,920 (1.29%)కి పెరిగింది. రికవరీ రేటు కూడా స్వల్పంగా తగ్గి 97.37%కి చేరింది.
* దేశవ్యాప్తంగా శుక్రవారం 17,76,315 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 2.42%కి చేరింది. దేశంలో ఇంతవరకు మొత్తం 46.64 కోట్లకు పైగా కరోనా పరీక్షలు జరిపారు.
* మహారాష్ట్రలో కొవిడ్‌ మరణాలు క్రితం రోజు కంటే పెరిగాయి. 24 గంటల్లో 231 మంది మృతి చెందారు. కేరళలో 116 మరణాలు సంభవించాయి. ఒడిశా (66) మినహా మిగిలిన రాష్ట్రాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య 35 లోపే ఉంది.
* 12 రాష్ట్రాల్లో క్రియాశీలక కేసులు పెరిగాయి. అత్యధికంగా కేరళలో వీటి సంఖ్య 6 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని